ప్రభుత్వ రంగ సంస్థకే జొన్నలు గ్రహించాలి

ప్రభుత్వ రంగ సంస్థకే జొన్నలు గ్రహించాలి

  • జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్

జైనూర్, ఆంధ్రప్రభ ; రైతులు పండించిన జోన్న ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న కేంద్రంలోని విక్రయించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ కోరారు. సోమవారం జైనూర్ మార్కెట్ కమిటీ పరిధిలోని ఉట్నూర్ మండలం హస్నాపూర్ లో మార్కెట్ కమిటీ, మార్కెట్ ఫెడ్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. జొన్నలు క్వింటాలు కు 3,699 మద్దతు కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ప్రైవేట్ లో తక్కువ ధరకు విక్రయించకుండా ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించాలని చైర్మన్ కోరారు. అనంతరం హస్నాపూర్ లోని మార్కెట్ కమిటీ గోదాములను పరిశీలించారు.

గోదాముల పరిస్థితి అద్వానంగా ఉండడంతో వాటి మరమ్మత్తు కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి నిధులు మంజూరు చేయించాలని కోరుతున్నానని ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయిస్తే గోదాముల మరమ్మతులు చేస్తామని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సహకార సంఘం వైస్ చైర్మన్ నారాయణ,నాయకులు,సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply