దళితులసాగు భూములకు అటవీ శాఖ ఆటంకాలు తొలగించాలి.

దళితులసాగు భూములకు అటవీ శాఖ ఆటంకాలు తొలగించాలి.

జిల్లా అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు బాధితుల వినతి…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని అడవిని ఆనుకుని ఉన్న మహానంది మండలం బుక్కాపురం పంచాయతీ పరిధిలోని పుట్టుపల్లి మజరా గ్రామానికి చెందిన 32 దళిత కుటుంబాలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై అటవీ శాఖ అధికారులు సాగిస్తున్న వేధింపులను వెంటనే నిలువరించాలని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.ఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డికి శనివారం బాధితులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టుపల్లె గ్రామస్తులు 32 పేద దళిత కుటుంబాలు గత 32 ఏళ్లుగా కృష్ణనంది దేవస్థానం సమీపంలోని తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద గల సర్వే నెంబర్లు 681, 797, 798, 799, 800, 809, 810 లలో ఉన్న సుమారు 87.31 ఎకరాల బంజరు భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. 1992 నుండి ఆ భూమిలో అరటి పంట పండించుకుంటూ జీవనం సాగిస్తు న్నారన్నారు. ఆ భూమి తప్ప వారికి మరో జీవనాధారం లేదన్నారు.

ఈ భూమిపై గతంలోనే అనేక అధికారిక ఉత్త ర్వులు వెలువడ్డాయని, అక్టోబర్ 24, 1995న అప్పటి మహా నంది తహశీల్దారు ఈ భూమిని పేద దళితులకు రైతువారీ పట్టాలుగా ఇవ్వవచ్చని జిల్లా కలెక్టరుకు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 22, 1996న నంద్యాల సబ్ కలెక్టరు ఆర్సీబీ,2760 మరియు 95 ఈ భూమిని జేఎఫ్ఎం పథకం కింద దళితులకు కేటాయించాలని డివిజనల్ ఫారెస్ట్ అధికారిని ఆదేశించారన్నారు. దళితులపై అటవీ శాఖ బనాయించిన అక్రమ కేసులను సీసీ నెం. 253/98 నంద్యాల జేఎంఎఫ్సీ కోర్టు జనవరి 23, 2002న కొట్టివేస్తూ తీర్పుని చ్చిందని, అక్టోబర్ 16, 2008న మరో కేసులో సీసీ నెం.537 దళితులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, గత మే 4వ తేదీన ఫారెస్టు అధికారులు గ్రామంలో దండోరా వేయించి, అరటి పంటను ధ్వంసం చేస్తామని, పొలాలను ఖాళీ చేయాలని బెదిరించడం దారుణమన్నారు.

అధికారుల దుందుడుకు చర్యలతో పేదలు భయాందోళనలకు గురవుతు న్నారని, వెంటనే అటవీ అధికారులు స్పందించి స్పందించి 87.31 ఎకరాల భూమి రెవెన్యూ ప్రభుత్వ భూమిగా గుర్తించి వారికి పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు.