పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి …
పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి …
తొర్రూర్ టౌన్ ,ఆంధ్రప్రభ : సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసన వ్యక్తం చేస్తూ శనివారం పట్టణంలోని గాంధీ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఓమ బిక్షపతి, బంధు మహేందర్లు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శనివారం మోడీ ప్రభుత్వంపెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు చమురు ధరలు పెరగడం వలన సామాన్యుడిపై ప్రభావం పడుతుందని ముఖ్యంగా రైతులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు
