జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం..

జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం..

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్..

జన్నారం, ఆంధ్రప్రభ : విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం ఫారెస్ట్ రేంజులో ఇద్దరు ఫారెస్ట్ అటవీ అధికారులను అటవీ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణతో జన్నారం ఫారెస్ట్ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ కుమారస్వామి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లవన్ కుమార్ లను సస్పెండ్ చేసినట్లు స్థానిక ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ మధ్యాహ్నం తెలిపారు.

ఆ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ ను కాలేశ్వరం జోన్ పీసీసీఎఫ్ ప్రభాకర్ సస్పెండ్ చేశారని, ఆ బీట్ ఆఫీసర్ ను మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ ఆశీష్ సింగ్ సస్పెండ్ చేశారని ఎఫ్డీఓ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు ఇటీవల పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ల వ్యవహారంలోనూ, ఇతర పలు ఆరోపణల నేపథ్యంలో ఆ ఇద్దరు అటవీ అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Leave a Reply