రోడ్ ప్రమాదాల నివారణ కోసం..

రోడ్ ప్రమాదాల నివారణ కోసం..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ, కరీంనగర్ ప్రధాన రహదారిలో హసన్ పర్తితో పాటు ఓఆర్ఆర్ పైన రోడ్ ప్రమాదాల నివారణకు హసన్ పర్తి పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా స్థానిక సిఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు 12 సైన్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో భాగంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి.. జాతీయ రహదారి పై ఎనిమిది, కిట్స్ నుండి అంబాల వెళ్ళే రెండు, ఓఆర్ఆర్ పై వంగపాడు దగ్గర రెండు హెచ్చరిక బోర్డులు నెలకొల్పామని తెలిపారు.

వాహనదారులు అతి వేగంగా నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించేందుకు… ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఈ బోర్డులు ఉపకరిస్తాయని తెలిపారు. హెచ్చరిక బోర్డులును గమనించి నెమ్మదిగా వెళ్ళాలని.. వాహనదారులు వారి గమ్యస్థలాలను సురక్షితంగా చేరుకోవడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు దేవేందర్, శీలం రవికుమార్ లు పాల్గొన్నారు.

Leave a Reply