వేలేరు మండలంలో “స్నేహ సమ్మర్ “కార్యక్రమం..
వేలేరు, ఆంధ్రప్రభ : వేలేరు మండల కేంద్రంలోని మండల మహిళ సమైక్య భవనంలో మండల సమైక్య ఆధ్వర్యంలో “స్నేహ సమ్మర్” కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల సమైక్య అధ్యక్షురాలు రేణుక, ఏపీఎం అనితల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేలేరు మండల ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేలేరు గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేసవి సెలవుల సందర్భంగా బాలికల అభివృద్ధికి ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తోందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డాక్టర్ కడియం కావ్యల సహకారంతో మండలంలోని వివిధ గ్రామాల్లో వివో భవనాలకు మంజూరు లభించి పనులు పూర్తి అవుతున్నాయని తెలిపారు. త్వరలోనే మండల సమైక్య భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో విజయలక్ష్మి, మండల సమైక్య కార్యదర్శి రాజమ్మ, సీసీలు రమాదేవి, నాగమణి, సతీష్, హెల్త్ సూపర్వైజర్, వివిధ గ్రామాల వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.
