రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు హామీని నిలబెట్టుకోవాలి..
రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు హామీని నిలబెట్టుకోవాలి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో పేద రెడ్డిలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం మనమంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని తెలంగాణ రెడ్డి సంఘాల రాష్ట్ర ఆడహాక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి పది జిల్లాలకు చెందిన రెడ్డి సంఘాల నాయకులు, రెడ్డి కులస్తులు నాగోల్ పిఏంఆర్ గార్డెన్ లో వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంఘాల పేరుతో ఉద్యమాలు చేస్తున్న రెడ్డిలంతా ఒకటై ఒకే వేదికపై సమావేశమై తమ ఐక్యతను చాటారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డిలు ఎవరికి వారు వేరువేరు పేర్లతో సంఘాలను పెట్టి ఉద్యమాలు చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందని, అందరం కలిసి ఒకే వేదిక ద్వారా ఉద్యమించినప్పుడే పాలకులు దిగివస్తారని, మన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. పేద రెడ్డిల సమస్యల పరిష్కారం కోసం, భవిష్యత్తు తరంను దృష్టిలో పెట్టుకొని వివిధ పేర్లతో నడుస్తున్న రెడ్డి సంఘాలన్నింటిని ఒకే వేదిక మీదకు తీసుకురావడం జరిగిందని వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ సంఘాలకు నాయకత్వం వహించిన రాష్ట్ర నాయకులు ఏనుగు సంతోష్ రెడ్డి, గోపు జయపాల్ రెడ్డి, పొద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, బుట్టెంగారి మాధవరెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డి తదితరులు కలిసి రెడ్డిల ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో తాత్కాలికంగా అడహాక్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు.
అడహాక్ కమిటి చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, కన్వీనర్ గా బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా కరుణాకర్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి, సలహాదారులుగా బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, నావోల్గ సత్యనారాయణ రెడ్డి, నూకల పద్మా రెడ్డి, డీకే వసంతరెడ్డి, గంగిడి శ్రీలతరెడ్డి, నందికొండ గీతారెడ్డి, సభ్యులుగా ఎన్నెపల్లి లింగారెడ్డి, ఎలిమినేటి సుమన్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగిందని, ఈ అడక్ కమిటీ సభ్యులు పూర్తి సమయాన్ని కేటాయించి గ్రామం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలలో పర్యటించి రెడ్డిలలో ఐక్యతను తీసుకురావడంతో పాటు కమిటీలను వేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన రెడ్డి కార్పోరేషన్ హామీని నిలబెట్టుకోవాలన్నారు.
రెడ్డిల సమస్యల పరిష్కారం కోసం మనమంతా కలిసి పోరాటం చేయడం కోసం కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, ఒకే వేదిక ద్వారా రెడ్డి సంఘం నిర్వహించే పోరాటాలకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల రెడ్డిలు అంతా ఐక్యంగా ఉండి మద్దతు ఇవ్వాలన్నారు. పేద రెడ్డిల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము స్వచ్ఛందంగా పని చేస్తామని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో యాదాద్రి జిల్లా నాయకులు బొబ్బిలి దామోదర్ రెడ్డి, రావి నారాయణరెడ్డి మనవడు రావి ప్రభాకర్ రెడ్డి, మన్నె నరసింహారెడ్డి, టేకుల మంజులారెడ్డి, దోనూరు రాంరెడ్డి, ఏనుగు కృష్ణారెడ్డి, ఎన్నేపల్లి లింగారెడ్డి, మల్లెపల్లి ప్రముఖరెడ్డి, మాధవరెడ్డి, నల్ల వెంకట్ రెడ్డి, నల్ల సత్యనారాయణ రెడ్డి, పగిళ్ళ భూపాల్ రెడ్డి, లెంకల నరసింహారెడ్డితో పాటు ఉమ్మడి పది జిల్లాలకు చెందిన వేలాది మంది రెడ్డిలు, రెడ్డి మహిళలు పాల్గొన్నారు.
