ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..

ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం..

  • ఇద్దరు యువకులు దుర్మరణం

ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ : ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం, నెల్లూరు కు చెందిన ఇద్దరు యువకులు కత్తి భరత్ కాంత్ (31), వృత్తి: యాక్టర్, గూడ సాయి త్రిలోక్ (31), వీరిద్దరూ నెల్లూరు నుంచి హైదరాబాద్ కి అని బయలుదేరారు.

ఆదివారం తెల్లవారుజామున మార్గం మధ్యలో బొంగ్లూర్ నుంచి తుక్కుగూడ వెళ్తుండగా అదే మార్గంలో నాలుగో లైన్ లో ముందు వెళుతున్న ఒక కంటైనర్ ట్రాక్ ను వీరి కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టినట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ ఫిర్యాదుదారుడైన రాయవరపు ప్రేమ్ కుమార్ (50) కి సమాచారం ఇచ్చారని అన్నారు.

కాగా ఇట్టి సంఘటన స్థలానికి వెళ్లి చూడగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతులను కారులో నుంచి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply