పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం…

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం…
నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వేముల శ్రీనివాస్ రెడ్డి.

మేడ్చల్, ఆంధ్రప్రభ : పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ పరిధిలోని కిష్టాపూర్ పట్టణంలో మధు లహరి నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి శనివారం రోజు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో, పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాలు, పట్టణాలు లేవని, పేదల కళ్లలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కురుమ, దుర్గం శివ శంకర్ ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు ఉదండపురం సత్యనారాయణ, రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ సీనియర్ నాయకులు గోమారం బాల్ రెడ్డి, తొంట యాదయ్య, గర్ధాస్ నరేందర్, చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్, నడికొప్పు రంజిత్ ముదిరాజ్, తొంట సుధాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
