మాదిగ బోనాల పోస్టర్‌ను ఆవిష్కరించిన జగ్గారెడ్డి

శనివారం బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలో తొలిసారిగా మాదిగ బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల పోస్టర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి గురువారం రాత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శనివారం నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు శ్రీ అంబాత్రయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామీజీని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.

శనివారం ఐబీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఊరేగింపు హస్తబల్ ఎల్లమ్మ ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఈ ఉత్సవాల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్వకేట్లు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు వెల్లడించారు.

మాదిగ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు.