Farooq Abdullah | నిందితుడి గుర్తింపు…

Farooq Abdullah | నిందితుడి గుర్తింపు…
Farooq Abdullah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఫరూఖ్ గన్‌మెన్లు వెంటనే తేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. ఘటన జరిగిన సమయంలో జమ్మూ డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరీ సైతం అక్కడే ఉన్నారు.
జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఫరూక్ అబ్దుల్లా ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి వెనుక నుండి వచ్చి ఆయనను కాల్చే యత్నం చేశాడు. వెంటనే ఇది గమనించిన ఎన్ఎసీ కమాండోలు అతని చెయ్యిని లాగడంతో ప్రమాదం తప్పింది. అయితే నిందితుడు 65ఏళ్ల కమల్సింగ్ అని అతను జమ్మూకు చెందిన పురాణాస్ మండీ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు.
