చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

మర్రిగూడ, ఆంధ్రప్రభ : ఎండలు మండిపోతున్న ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న దాహార్తిని ముందుగానే గుర్తించిన స్థానిక సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్, గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సర్పంచ్ బాటసారులు, గ్రామ ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ప్రారంభించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఈ వేసవి ఎండల్లో అల్లాడిపోయే ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు చలివేంద్రం ఒక వరప్రసాదమని, ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించే సర్పంచ్ సంతోష్ యాదవ్, చొరవ నిజంగా కొనియాడదగినదని గ్రామస్థులు కృతజ్ఞతాపూర్వకంగా కొనియాడుతున్నారు.

మంగళవారం మాజీ మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ తో కలిసి, ఆయన నూతన చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ప్రజా ప్రతినిధులు ప్రజల ప్రాథమిక అవసరాల పట్ల, ఇంతటి బాధ్యతతో వ్యవహరించడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచ్ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలపై కృతజ్ఞతలు తెలియజేశారు.