Erragadda | Crime | యువతి హత్య..

Erragadda | Crime | హైదరాబాద్, ఆంధ్రప్రభ : దుండ‌గుడి చేతిలో ఓ యువ‌తి దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎర్ర‌గ‌డ్డ‌లో చోటుచేసుకుంది.. తనతో మాట్లాడడం లేదని యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పబ్‌లో పనిచేసే సమయంలో యువతితో యువకుడికి పరిచయం ఉంది.. ఇటీవలే వేరే పబ్‌లో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. తనతో మాట్లాడడం లేదని అనుమానంతో ఆ యువకుడు ఆమెను హత్య చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని బోరబండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు.. నిందితుడు జహీర్ జ్యూస్ సెంటర్‌లో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వెనుక నిర్మానుష్య ప్రదేశంలో ఖనిజ ఫాతిమాను జకీర్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న బస్తీకి వెళ్లి విషయం చెప్పాడు. బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫాతిమా మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply