టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్ దే !
ఆంధ్రప్రభ, కార్డిఫ్ : భారత్–ఇంగ్లండ్ మధ్య సోఫియా గార్డెన్స్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. భారత్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. అనారోగ్యంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరమవగా, అతని స్థానంలో వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించారు. ఇక ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జోష్ టంగ్, లియామ్ డాసన్ స్థానాల్లో గస్ అట్కిన్సన్, సాకిబ్ మహ్మూద్ జట్టులోకి వచ్చారు.
భారత్ తుది జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు
బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మూద్.
