ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి- డీఎఓ సాలు రెడ్డి

రాప్తాడు, ఆంధ్రప్రభ: ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉండడం వలన కంది పంటలో తల్లి సాలు పక్కనే మడకసాలు దున్నడం ద్వారా వర్షం పడినప్పుడు భూమి లోకి నీరు బాగా ఇంకి పంటకు ఎక్కువ రోజులు నీటి ఎద్దడి లేకుండా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్.సాలు రెడ్డి పేర్కొన్నారు.రాప్తాడు మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామ నందు వేరుశనగ కంది ఇతర పంట పొలాలను పరిశీలించారు.

ఈ సంధర్భంగా రైతులతో కలిసి మాట్లాడుతూ.. జులై 31 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడానికి గడువు పొడిగించడం వలన పంటలు సాగు చేసిన ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ ను బ్యాంకుల నందు చేయించుకోవాలని తెలిపారు.క్రాప్ లోన్ లేని రైతులు సిఎస్ సి లో లాగిన్ చేయించుకోవాలి అని అన్నారు.అలాగే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ-పంట నమోదు కార్యక్రమం ప్రారంభించామని పంట సాగు చేసిన ప్రతి రైతు కూడా ఈ-పంట నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ఏ.వెంకట్ కుమార్ మండల వ్యవసాయ అధికారి ఎస్.కృష్ణ చైతన్య ఏఈవోలు సుజిత రంజిత ఆర్ ఎస్ కే సిబ్బంది లక్ష్మి సోనియా భార్గవ్ రైతులు పాల్గొన్నారు.