క్రీడాకారుల‌కు ప్రోత్సాహం…

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన వివిధ క్రీడా పోటీలలో ప్రతిభను క‌న‌బ‌రిచి.. పతకాలు సాధించిన చిన్నారుల‌కు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ జంపన ప్రతాప్ సత్కరించారు.

జిల్లా స్థాయి రచన పోటీలో MKR ఉన్నత పాఠశాల విద్యార్థి N.ద్వారక్ మణితో పాటు.. కబడ్డీ, ఇతర క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారుల‌ను జంపన ప్రతాప్ శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అథ్లెట్లకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్ కోచ్ సాయి బాబా యాదవ్, కరణ్ సింగ్, శివ, అరుణ్ యాదవ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply