లయన్స్ క్లబ్ సభ్యత్వం ద్వారా అద్భుత గౌరవం, గుర్తింపు
లయన్స్ క్లబ్ సభ్యత్వం ద్వారా అద్భుత గౌరవం, గుర్తింపు
లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గోలి
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : లయన్స్ క్లబ్ లో సభ్యత్వం ద్వారా సమాజంలో అద్భుతమైన గౌరవంతో పాటు మంచి గుర్తింపు లభిస్తాయని లయన్స్ క్లబ్ మోటివేటర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ గవర్నర్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు. నేరేడుచర్ల లయన్స్ క్లబ్ 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో ముందుండే ఈ అంతర్జాతీయ సంస్థలో భాగం కావడం వల్ల అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందన్నారు.
సమాజంలో వెనుకబడిన వారికి, పేదలకు సహాయం చేయడం ద్వారా మీకంటూ ఒక ప్రత్యేకమైన సామాజిక బాధ్యత, గుర్తింపు ఏర్పడతాయన్నారు.క్లబ్ లో వివిధ బాధ్యతలు నిర్వహించడం ద్వారా నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయని, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులతో పరిచయాలు ఏర్పడి వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు. అంతకుముందు నూతన అధ్యక్షులుగా షేక్ యూసఫ్ ప్రధాన కార్యదర్శిగా సరికొప్పుల నాగేశ్వరరావు కోశాధికారిగా బదావత్ సైదులు, ఉపాధ్యక్షులుగా నీలా శ్రీనివాస్, చిత్రం విశ్వనాథ్, మూల గుండ్ల వెంకటరెడ్డి, బసవ కోటేశ్వరరావు లచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో
జోన్ చైర్ పర్సన్ కామా వెంకటేశం, రీజినల్ చైర్ పర్సన్ ఏచూరి భాగ్యలక్ష్మి, చార్టర్ ప్రెసిడెంట్ కొణతం సీతారామరెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మెన్ లు బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, సభ్యులు రాచకొండ రామ్మోహన్ రావు, రాచకొండ అంజయ్య, బాలా వెంకటేశ్వర్లు, కందిబండ శ్రీనివాసరావు, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
