ప్లాస్టిక్ రహిత పంచాయతీగా మారుద్దాం
ప్లాస్టిక్ రహిత పంచాయతీగా మారుద్దాం
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు గ్రామ పంచాయతీని సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పంచాయతీగా మార్చడమే లక్ష్యంగా శనివారం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవగాహన ర్యాలీ మరియు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛ రథం వాహనం ద్వారా గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే సింగిల్ యూజ్ (ఏకకాల వినియోగ) ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వాడకాన్ని పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు.
వాటి స్థానంలో ప్రతి ఒక్కరూ కాటన్ జనపనార సంచులు మరియు స్టీల్ రాగి బాటిళ్లను ఉపయోగించాలని కోరారు.ప్లాస్టిక్ రహిత రాప్తాడు నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన బ్యానర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశోక్ బాబు గ్రామ పంచాయతీ కార్యదర్శి శమంతకమణి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
