ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం

ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం

భూసిమెట్టలో గాలి వాన బీభత్సం…
ఇళ్ల పై కప్పులు లేసి దెబ్బతిన్న‌ రెండు ఇల్లు ..
బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు..

ఉట్నూర్ /జైనూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచి కొట్టింది. గాలివాన బీభత్సంతో చాలా గ్రామాల్లో పలు నష్టాలు జరిగినట్లు ప్రజలు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు అకాల ఈదురుగాల వాన బీభత్సంతో పలు గ్రామాల్లో నష్టాలు జరగా రబ్బీ పంటలకు నష్టం జరిగిందని ప్రజలు పేర్కొన్నారు. జైనూర్ మండలంలోని జామిని రోడ్డు గూడలో విద్యుత్ వైర్లపై గాలి దుమారానికి చెట్టు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టిఆర్ఎస్ యువ నాయకులు కేంద్రే విశాల్ తెలిపారు.

కార్మికులతో విద్యుత్ వైర్ల‌పై పడ్డ చెట్టు కొమ్మలను కట్ చేయించి తొలగించామని ఆయన పేర్కొన్నారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరదనీరు రోడ్లపై పారినాయి, కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లోని భూసిమెట్ట గ్రామ పరిసర ప్రాంతంలో కురిసిన అకాల వర్షం.. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి దుమారం వల్ల ఆత్రం రాధ బాయి, ఆత్రం సముద్ర బాయి ఇంటి పై కప్పులు లేసి కిలో మీటరు దూరం పంట చేనులోకి ఎగిసిపడ్డాయి.

వర్షపు నీరు ఇంటి లోకి ప్రవేశించడం తో నిల్వ చేసిన తినుబండారాలు, బియ్యం, జొన్నలు, బట్టలు తడిసి ముద్దయ్యాయి. గ్రామంలో కరెంటు తీగలు తెగి పడటంతో అంధకారం నెలకొంది. కాగా ఈ విషయం తెలుసుకున్న జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు గారు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నష్టపోయిన వివరాలను తెలుసుకొని పేద కుటుంబాలను ఆదుకోవాలని తహసీల్దార్ ఆడ బిర్షావ్ కు చరవాణి ద్వారా సూచించారు.

తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. అకాల గాలి వాన వల్ల ఈ గ్రామాల్లోనైనా నష్టం జరిగితే ఆయా గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తాసిల్దార్ ఆడబీర్షావ్ కోరారు. చైర్మన్ వెంట సర్పంచి లు ఆత్రం సింధు నగేష్, ఆత్రం జాలిం షా, మెస్రం భూపతి , కాంగ్రెస్ నాయకులు పెందుర్ ప్రకాష్, మెస్రం అంబాజీ రావు, హైదర్, యాదవ్ రావు, పెరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply