Revanth Reddy | 9న సీఎం రైతు ఆశీర్వాద సభ

జగన్నాథపురంలో ఏర్పాట్లు…

Revanth Reddy | ఆంధ్రప్రభ, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన సభ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

గత నెల 30న ఖమ్మంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో వాయిదా పడిన సభను ఈ నెల 9న నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం ఈ నెల 9న సభ నిర్వహణపై అధికారిక ప్రకటన చేస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎం సభకు భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.