చెన్నూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్

చెన్నూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్

చెన్నూర్ , ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఈరోజు సాయంత్రం సందర్శించారు. తోలుత కోటపెల్లి మండలం రాపనపల్లి చెక్ పోస్ట్ ను సందర్శించిన అనంతరం సాయంత్రం చెన్నూర్ పోలీస్‌ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,నేరాల నియంత్రణ కు పెట్రోలింగ్, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ కావున పోలీస్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు గ్రామాలను సందర్శించాలని, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట టౌన్ సీఐ బన్సీలాల్, సిబ్బంది వున్నారు.