ఆపదలో ఉన్న మహిళకు గ్రామస్తుల అండ..
- రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందజేత
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న తమ గ్రామానికి చెందిన జన్ను సంధ్యకు అండగా నిలుస్తూ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల దాతలు మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామ ప్రజల పిలుపుకు గొప్ప మనసుతో స్పందించిన 160 మంది దాతలు మొత్తం రూ.1,35,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సేకరించిన ఈ మొత్తాన్ని హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జన్ను సంధ్యకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
గ్రామంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అందరూ ఒక్కటై వారికి ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి మిట్టగడపాల లక్ష్మి చిరంజీవి, ఉపసర్పంచ్ అల్లే రవికుమార్, మాజీ జడ్పీటీసీ కోమండ్ల జయగోపాల్ రెడ్డి, చేరలు, మల్లికార్జున్, కర్ణాకర్ రెడ్డి, రత్నకుమార్, అబిలాష్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయం అందించిన ప్రతి దాతకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సహాయం చేయాలనుకునే దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
