కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆర్పీ పట్నాయక్

జగిత్యాల, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ ముఖ్య అర్చకుడు లక్ష్మణాచారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి స్వామివారి ఆశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్ పాల్గొన్నారు.