Madhya Pradesh | ఒకే కుటుంబంలో ఐదుగురి మృత్యువాత
Madhya Pradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని మైహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ కుటుంబం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
