TG Assembly | తెలంగాణ అసెంబ్లీ కమిటీల ప్రకటన…
2026–27 కమిటీలకు కొత్త ఛైర్మన్లు
పాయం వెంకటేశ్వర్లుకు కీలక బాధ్యతలు
TG Assembly |ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన వివిధ కమిటీల ఛైర్మన్లు, సభ్యులను నామినేట్ చేస్తూ లెజిస్లేచర్ బులెటిన్ విడుదలైంది. ఉమ్మడి కమిటీలు, సంక్షేమ కమిటీలు, శాసనసభ కమిటీలు, శాసనమండలి కమిటీలకు బాధ్యతలను కేటాయించారు.
షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ (ఎస్‌టీ) రాష్ట్ర ఛైర్మన్‌గా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నియమించారు. అలాగే వివిధ కమిటీలకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.
ఉమ్మడి కమిటీల ఛైర్మన్లు…
సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ – కడియం శ్రీహరి
అమెనిటీస్ కమిటీ – తెలంగాణ శాసనసభ స్పీకర్
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ – మేడిపల్లి సత్యం
షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ – పాయం వెంకటేశ్వర్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ – మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
గ్రంథాలయ కమిటీ – డా. మట్టా రాగమయి
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీ – చిట్టెం పర్ణికా రెడ్డి
మైనారిటీల సంక్షేమ కమిటీ – లక్ష్మీకాంతరావు తోట
వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ – తెలంగాణ శాసనసభ స్పీకర్
శాసనసభ కమిటీలు
పిటిషన్స్ కమిటీ – తెలంగాణ శాసనసభ ఉప సభాపతి
ప్రివిలేజెస్ కమిటీ – తెలంగాణ శాసనసభ ఉప సభాపతి
ప్రభుత్వ హామీల కమిటీ – పట్లోళ్ల సంజీవ రెడ్డి
రూల్స్ కమిటీ – తెలంగాణ శాసనసభ స్పీకర్
ఎథిక్స్ కమిటీ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
శాసనమండలి కమిటీలు
పిటిషన్స్ కమిటీ – తెలంగాణ శాసనమండలి ఉప ఛైర్మన్
ప్రివిలేజెస్ కమిటీ – తెలంగాణ శాసనమండలి ఉప ఛైర్మన్
ప్రభుత్వ హామీల కమిటీ – కేతావత్ శంకర్
రూల్స్ కమిటీ – తెలంగాణ శాసనమండలి ఛైర్మన్
ముందుంచిన పత్రాల కమిటీ – చల్లా వెంకట్రాం రెడ్డి
ఎథిక్స్ కమిటీ – మహేష్ కుమార్ గౌడ్
వివిధ కమిటీల నియామకంతో శాసనసభ, శాసనమండలి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

