మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి..

మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి..
మామడ, ఆంధ్ర ప్రభ : గ్రామ పంచాయతీ నర్సరీలలో మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని మామడ ఎంపిడివో వెల్మ సుశీల్ రెడ్డి అన్నారు. బుధవారం మామడ మండలంలోని దిమ్మదుర్తి నర్సరీని ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా నర్సరీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఇందులో సర్పంచ్ లక్ష్మణ్,ఉప సర్పంచ్ నర్సయ్య,కార్యదర్శి గీతారాణి, ఎఫ్ఏ సుధాకర్ ఉన్నారు.
