Belgium-Beat-Usa : బెల్జియం కిక్​ Andhra Ptabha Sportd Story

Belgium-Beat-Usa : బెల్జియం కిక్​ Andhra Ptabha Sportd Story

  • అమెరికా ఔట్​
  • 3-1 తేడాతొ యూఎస్​ ఏ ఓటమి
  • మైండ్​ బ్లోయింగ్ హీరో.. చార్లెస్​ వన్​ మ్యాన్​ ఫో
  • జూలై 9న స్పెయిన్​ తో భిగ్​ ఫైట్​

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి)

సీయాటిల్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత నాకౌట్ మ్యాచ్‌లో బెల్జియం 3-1 తేడాతో అమెరికా జట్టు పై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది , ఈ ఓటమితో ఫిఫా టోర్నీ ఆతిథ్య దేశం అమెరికా టోర్నీ నుండి అధికారికంగా వైదొలగింది, : బెల్జియం స్టార్ ఫార్వర్డ్ చార్లెస్ డి కేటెలారే మ్యాచ్ ఆరంభం నుంచే అమెరికా డిఫెన్స్‌ను చెండాడు, . 9వ నిమిషంలో తొలి గోల్ కొట్టి జట్టుకు లీడ్ అందించాడు. 31వ నిమిషంలో యూఎస్ మిడ్‌ఫీల్డర్ మాలిక్ టిల్‌మన్ ఫ్రీ-కిక్ ద్వారా ఒక మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు, కానీ ఆ ఆనందం అమెరికాకు రెండు నిమిషాలు కూడా నిలవలేదు 33వ నిమిషంలో లీనార్డో ట్రోసార్డ్ ఇచ్చిన క్రాస్‌ను చార్లెస్ డి కేటెలారే హెడర్ ద్వారా మళ్లీ గోల్‌గా మలిచాడు. రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన హన్స్ వనాకెన్ బెల్జియంకు మూడో గోల్ అందించి అమెరికా క్వార్టర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు.

Belgium-Beat-Usa : బలోగన్​ తుస్​..

మ్యాచ్‌కు ముందు అమెరికా స్టార్ ప్లేయర్ ఫొలారిన్ బలోగన్ గ్రూప్ స్టేజ్ రెడ్ కార్డ్ సస్పెన్షన్‌ను ఫిఫా రద్దు చేయడంతో పెద్ద వివాదానికి దారితీసింది. బెల్జియం కోచ్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మైదానంలో బెల్జియం డిఫెండర్లు జెనో డెబాస్ట్, వౌట్ ఫేస్ అంగుళం కూడా స్పేస్ ఇవ్వకుండా లాక్ చేయడంతో బలోగన్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.

Belgium-Beat-Usa : చార్లెస్ వన్-మ్యాన్ షో:

చార్లెస్ డి కేటెలారేఈ మ్యాచ్‌లో బెల్జియం తరఫున చార్లెస్ డి కేటెలారే హీరోగా నిలిచాడు. రెండు క్లిష్టతర గోల్స్ చేయడమే కాకుండా మ్యాచ్ అంతటా అమెరికా బాక్స్‌పై రైడ్స్ చేస్తూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘన విజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరిన బెల్జియం, వచ్చే శుక్రవారం (జూలై 10న) లాస్ ఏంజిల్స్ వేదికగా జరగబోయే బిగ్ ఫైట్‌లో పటిష్ట స్పెయిన్ జట్టుతో తలపడనుంది ,