విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి…

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి…

దుర్గి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం దుర్గి మండలపరిధిలో ఉన్న ముటుకూరు గ్రామంలో పొలంలో ఈ సంఘట నచోటుచేసుకుంది. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి కొల్లి హనుమయ్య వయస్సు 55సం. లు తండ్రి వెంకటేశ్వర్లు. తన పొలంలో మోటారు వేయటానికి వెళ్లి అనుకోకుండా విద్యుత్ షాక్ కు గుర‌య్యారు.

ఈ విషయం తెలుసుకుని బంధువులు అతనిని ఆసుపత్రికి తరలిస్తు ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు తెలిసింది. వారి బంధువులు ఎలాంటి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటానికి, పిర్యాదు చేయటానికి ఇష్ట పడటం లేదని తెలిసింది. భార్య, పిల్లలు ఉన్నారు.