బోధన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

బోధన్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం బోధన్ లో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన కీర్తిని కొనియాడారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద గల విగ్రహానికి అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేశారు. సమాన హక్కుల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల సలహాదారు సుదర్శన్ రెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్మన్ పద్మావతి శరత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు
