అమీనాపూర్లో ఎస్ఐఆర్ ఇన్విటేషన్ ఫామ్ పంపిణీ
అమీనాపూర్లో ఎస్ఐఆర్ ఇన్విటేషన్ ఫామ్ పంపిణీ
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో సోమవారంఎస్ఐఆర్ ఇన్విటేషన్ ఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్ గుండం సౌందర్య ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఫామ్లను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల సమాచారం ప్రతి ఒక్కరికీ అందాలని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓ గంగాధర్, వీఆర్ఏ తల రాజన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాజన్న, సాయిరాంతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
