పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు..
పరకాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ బి. సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడే విధంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమాల వివరాలు:
మే 11, 2026
- ప్రారంభోత్సవ కార్యక్రమం
- కరపత్రాల (బ్రోచర్) ఆవిష్కరణ
- పరస్పర ఒప్పందాల కుదుర్చుకోవడం
మే 12, 2026
- మత్తుమందు వ్యసన విముక్తిపై అవగాహన
- ఋతుక్రమ ఆరోగ్యంపై కార్యక్రమం
- వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- పీజీ కోచింగ్
- యోగ, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు
మే 13, 2026
- కళాశాల అడ్మిషన్లపై నియోజకవర్గ కౌన్సిలర్లతో ముఖాముఖి
- మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు
- ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు
- సాంస్కృతిక కార్యక్రమాలు
- విశిష్ట సాధకులకు సన్మానం
మే 14, 2026
- తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం
- కళాశాల సందర్శన
- పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- రక్తదాన శిబిరం
మే 15, 2026
- గ్రంథాలయ దినోత్సవ వేడుకలు
- పుస్తక ప్రదర్శన
- పుస్తకాల వివరణ కార్యక్రమం
- ఉత్తమ పాఠకులకు సన్మానం
మే 16, 2026
- కృత్రిమ మేధస్సు (ఏఐ)పై అవగాహన సదస్సు
- సాంస్కృతిక కార్యక్రమాలు
- ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్
- ఎన్‌ఎస్‌ఎస్, ఆవిష్కరణల కార్యక్రమాలు
మే 17, 2026
- ముగింపు సమావేశం
- ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానం
విద్యార్థుల్లో నైపుణ్యాలు, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.
