కారు గుర్తుపై ఓటు వేయండి..

పాల్వంచ, ఆంధ్రప్రభ : కారు గుర్తుపై ఓటు వేసి చింతలచెరువు దుర్గాప్రసాద్ ను గెలిపించాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే పూలమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం 44 వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ కి మద్దతుగా వర్మ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి దుర్గాప్రసాద్ సమర్థవంతమైన నాయకుడని, కొట్లాడి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే సత్తా ఉన్న వ్యక్తి అని డివిజన్ అభివృద్ధి చెందాలంటే నిజాయితీ గల దుర్గాప్రసాద్ ను గెలిపించాలని కోరారు. దుర్గాప్రసాద్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఓటర్లు అభ్యసించారు. ఓటు ఒక ఆయుధమని అలాంటి ఆయుధం ఉపయోగించే అవకాశం వచ్చినందున కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply