పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు..
- రామగుండం సర్కిల్ లోకి బసంత్ నగర్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధి మారుస్తూ గెజిట్ వెలువడింది. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల పరిధిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోని గోదావరిఖని టూ టౌన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న జనగామ గ్రామం తో పాటు సమ్మక్క సారలమ్మ గద్దెలు, గోదావరి బ్రిడ్జ్, గంగానగర్ ను గోదావరిఖని వన్ టౌన్ లో కలిపారు. ప్రస్తుతం పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న బసంత నగర్ పోలీస్ స్టేషన్ను రామగుండం సర్కిల్ లో కలుపుతూ గోదావరిఖని సబ్ డివిజన్లో కలిపారు. ప్రస్తుతం అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లింగాపూర్ గ్రామం తో పాటు కుందన్పల్లి గ్రామాన్ని రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిని మారుస్తూ అధికారిక ఉత్తర్వులు ఈరోజు లేదా రేపు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
