ఎస్‌ఐఆర్ సర్వేకు ఓటర్లు సహకరించాలి…
కడెం, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ (SIR) సర్వే ప్రక్రియలో భాగంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలోని బూత్ నంబర్-160 పరిధిలో బీఎల్‌ఓ షహనాజ్ బేగం, స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, రేషన్ షాప్ డీలర్ ఆర్. సాయిరాజ్, బీఎల్‌ఏ కాలువ తిరుపతి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.
అర్హులైన ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని వారు కోరారు. అలాగే ఎస్‌ఐఆర్ సర్వే, ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.
