ముంజులూరులో వంగవీటి మోహనరంగాకు ఘన నివాళులు
రంగా ఆశయాలను స్మరించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్
బంటుమిల్లి, ఆంధ్రప్రభ: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరొందిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంగా ఆశయాలను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
