Drunk and drive | మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
Drunk and drive | మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
- దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్.
Drunk and drive | దండేపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్ అన్నారు. ఈ రోజు నాకబందిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుండి జనవరి 2026 కొత్త సంవత్సరం వచ్చేవరకు వాహనదారులు, టూవీలర్ గాని ఫోర్ వీలర్ గానీ నడిపినప్పుడు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు.

వాహనదారులు మద్యపానం సేవించకుండా నెమ్మదిగా వెళ్ళాలని, మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని మైనర్ లు వాహనాలు నడపరాదాని, త్రిబుల్ రైడింగ్(triple riding) చేయరాదన్నారు, ఒకవేళ ఫిఫ్టీ విషయాలను విస్మరిస్తే తగు కఠిన చర్యలు తీసుకొంటామని అవసరమైతే జైలుకు కూడా పంపుతామని పేర్కొన్నారు. వాహనా దారులు అందరు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
