Rayalaseema Lift Irrigation | చంద్రబాబుపై సజ్జల ఫైర్..

Rayalaseema Lift Irrigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు.

ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోందని, కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం ఈ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని సజ్జల పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధి, నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యంపై మేధావులు, ప్రజాసంఘాలు, నిపుణుల మధ్య విస్తృత చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు.