మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు..

మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈనెల 23వ తేదీ వరకు నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు మొక్కజొన్నలు తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి రైతులకు ముఖ్య ప్రకటన చేశారు. నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డునెల్లికొండ మార్కెట్ యార్డ్లో ఎమ్మెస్ పి ధరలకు మక్కల కొనుగోలు కొనసాగింపు జరుగుతుందని, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పి.ఎ.సి.ఎస్ ద్వారా నేరుగా కొనుగోళ్లు చేస్తామని తెలిపారు.
గత రెండు రోజులుగా మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నలు భారీగా రావడం జరిగిందని, మార్కెట్ యార్డ్ మొత్తం మొక్కజొన్నతో నిండిపోవడంతో తీవ్ర రద్దీ పరిస్థితి ఏర్పడిందని ప్రకటనలో పేర్కొన్నారు. నడవడానికి కూడా స్థలం లేని విధంగా యార్డ్ పరిస్థితి నెలకున్నదని.. అందువల్ల ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో సరుకులు పెట్డానికి స్థలం లేదు. యార్డ్లో ఉన్నవి పూర్తిగా తరలించే వరకు కొత్త సరుకు తీసుకురావద్దు అని రైతులకు చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అలాగే గోదాములకు తరలింపు పూర్తయ్యే వరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. తేది 23-04-2026 వరకు లేదా తదుపరి ప్రకటన వరకు సరుకు తీసుకురావద్దు.. రైతులు సహకరించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ వేనేపల్లి రమణారావు కోరారు.
