పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రికి వినతి…

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రికి వినతి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిబిజ్వార్ గ్రామ అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి బిజ్వార్ మాజీ సర్పంచ్ సావిత్రమ్మ వెంకట్ రెడ్డి శనివారం మంత్రినికలిసివిజ్ఞప్తిచేశారు. బిజ్వార్ గ్రామంలోఅభివృద్ధి పనుల్లో భాగంగా మన ఊరు మన బడి టాయిలెట్ బిల్డింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పథకంలోసిసి రోడ్ల బిల్లులు, గ్రామపంచాయతీ నూతన భవన బిల్లు లను విడుదల చేయాలని, లక్షల రూపాయల అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే మూడు సంవత్సరాలైన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అప్పులు చేసి పనులు చేపట్టిన తమకు బిల్లులు అందలేదని పేర్కొన్నారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, ఏ సలీం, తదితరులుపాల్గొన్నారు.
