దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు
దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : తాను అద్దెకు ఉన్న ఇంట్లో దొంగతనం జరిగి రెండు సంవత్సరాలు అవుతున్న పోలీసులు తనకు న్యాయం చేయటం లేదని బాధిత ఒంటరి మహిళ రేణుక ఆవేదన వ్యక్తం చేశారు ఆమె శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రెస్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఉట్నూర్ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల చౌక్ సమీపంలో అద్దె గదిలో ఉంటున్న తన ఇంటి నుంచి 2024 ఏప్రిల్ లో ఆరు తులాల బంగారం, నగదు డబ్బులు చీరలు దొంగతనం జరిగాయని ఈ విషయంపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.
ఏప్రిల్ 2024లో దొంగలు అపహరించిన పోలీసులు ఇంతవరకు న్యాయం చేయడం లేదని బాధిత మహిళ మేడ రేణుక తెలిపారు. 20 ఏప్రిల్ 2024న తాను పని కోసం ఆసిఫాబాద్ వెళ్ళగా తన ఇంట్లో చేరబడి ఆరు తులాల బంగారం, విలువైన చీరలు డబ్బు దొంగతనం చేశారని, ఉట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసి అనుమానితుల పేర్లు కూడా చెప్పడం జరిగిందన్నారు. తనకు ఉట్నూరు పోలీసుల వద్ద న్యాయం జరగలేదని జిల్లా పోలీసు అధికారి కార్యాలయానికి కూడ వెళ్లి ఫిర్యాదు చేశానన్నారు.
ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తాను లేనప్పుడు వచ్చి తాను చెప్పిన అనుమానితుల తో మాట్లాడి వెళ్లారు కానీ ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, తాను ఒంటరి మహిళను అయినందున తనకు జిల్లా పోలీసు అధికారి న్యాయం చేయాలని కోరారు. తనకు ఇంకా న్యాయం జరగకపోతే ప్రజా భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తానని ఆమె వివరించారు. ఈ విషయమై ఉట్నూర్ ఎస్సై విజయ్ ని ప్రశ్నించగా అనుమానితులను ప్రశ్నించామని ఎలాంటి ఆన వాళ్లు లభించలేదని తెలిపారు.
