DM&HO | టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు

DM&HO | టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు
DM&HO | భీమిని, ఆంధ్రప్రభ : జిల్లాలో టీబీ వ్యాది నివారణకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో, అన్ని సబ్ సెంటర్లలో సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధిప్రోగ్రాం(Tuberculosis Program) అధికారి, బెల్లంపల్లి డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ(DM&HO) డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు.
ఈ రోజు భీమిలి మండల కేంద్రంలో క్షయ వ్యాధిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు, వైద్యాధికారి, ఎమ్మెల్యే, హెచ్ పీలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో వంద రోజుల్లో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తీపి వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక చికిత్సలు జిల్లాలోని బెల్లంపల్లి, లక్షేట్టిపేట, చెన్నూరు, మంచిర్యాల, మందమర్రి టీబీ కేంద్రాల్లో వ్యాధిగ్రస్థులకు తగు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులు(Tuberculosis patients) ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో కోలుకుంటారని అందుకు అవసరమైన మందులు, చికిత్స, సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
సిగరెట్ తాగడం, పొగాకు, అంబారుతినడం వంటివాటితో పాటు మద్యపానం సేవించే వారు క్షయ వ్యాధి అనుమాగ్నితులుగా ఉంటారని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ పేర్కొన్నారు. ప్రజలకు వాటికి దూరంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
క్షయ వ్యాధి నిర్ధారణకు నిర్ధారితులు తమకు సమీపంలో గల టీబీ కేంద్రాల్లో(TB Centers) సంప్రదించి వైద్య చికిత్సలు పొందాలని అందుకు ప్రాథమిక ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గల సిబ్బంది సహాయసహకారాలు అందించాలని ఆయన సిబ్బందిని, వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అనీల్ కుమార్, సీ హెచ్ వోలు పుట్ట సత్తయ్య, జెలపతి, హెల్త్ అసిస్టెంట్ ఉమా శంకర్, పలువురు ఎం ఎల్ హెచ్ వో లు, ఏ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
