గుండెపోటుతో ఉప సర్పంచ్ మృతి..
గుండెపోటుతో ఉప సర్పంచ్ మృతి..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ.: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం ఉప సర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి(52) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో చెందాడు. అందరితో మమేకమైన వ్యక్తి.. అందరివాడు లక్ష్మారెడ్డి మరణం బాధాకరమని ప్రజలు అంటున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. లక్ష్మారెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
