కమీషనర్ సేవలు అభినందనీయం…

భీమ్‌గల్ టౌన్ , ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణం అభివృద్ధి కొరకు మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ అందించిన సేవలు అభినందనీయం అని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. శనివారం మున్సిపల్ కమీషనర్ గా సేవలు అందించి బదిలీపై వెళుతున్న కమీషనర్ ను ఎంపీడీఓ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది వేర్వేరుగా సన్మానించారు.

ఉద్యోగులకు బదిలీలు సహజం అని పని చేసే చోట చేసిన సేవలు ప్రజల మనసులో నిలిచి ఉంటాయని అన్నారు. ఈ సందర్బంగా కమీషనర్ ను పూల మాల, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెప్మా పీడీ నందన్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ ఎంపీడీఓ, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.