గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

  • పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శనివారం మండల కేంద్రంలోని 14వ వార్డులో మురికి కాలువల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. మురికి కాలువలు నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు. కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, సచివాలయ కార్యదర్శులు మహేష్ గౌడ్ ,నాయకులు శంకర్, సురేష్, డప్పు రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply