District Chief Secretary | గుత్త సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు….

District Chief Secretary | గుత్త సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు….
- పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వై జనార్దన్ రెడ్డి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల సమయపాలనపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ వ్యాఖ్యలు సరైంది కాదని నారాయణపేట పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డిలు తీవ్రంగా ఖండించారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పి ఆర్ టి యు ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్ రద్దుచేసి పీఆర్సీని మంచి ఫిట్మెంట్తో ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసనమండలిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడుతూ… ఉపాధ్యాయులు నాలుగు గంటలకే వెళ్ళిపోతున్నారని అనడం సరైనది కాదని అన్నారు.
ఉపాధ్యాయులు ప్రభుత్వం అనేక ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన సమయపాలన పాటిస్తూ పాఠశాలలను పరిరక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఉపాధ్యాయుల ఆత్మగౌరవము దెబ్బతింటుందని గుత్త సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి నర్సింహా రెడ్డి, నారాయణ పేట మండలం అధ్యక్షుడు ఏం రఘువీర్, దామర్ గిద్ద మండలం అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఉట్కూర్ గౌరవ అధ్యక్షుడు ఫజల్, రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సభ సుల్తానా, మహిళా అధ్యక్షుడు శ్రీ విద్యా, సుజాత, ఆనంద్, మహేష్, గోపాల్, ఆంజనేయులు, భాస్కర్, సత్యపాల్, విక్టర్ పాల్, ప్రసాద్, శశిరేఖ, శశిదర్, సాయప్ప, రాములు, రేనమ్మ, రజిత, ఇందిరా దేవి, ఖాసీం, డేవిడ్ స్వరూప్ రాజ్, మహేష్, వెంకటప్ప, సాయిలు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
