టెన్త్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ

టేకుమట్ల, ఆంధ్రప్రభ: నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ఆర్జే జ్యోతిష్వరెడ్డి ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గురువారం టేకుమట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షుడు సంపత్ రావు పాల్గొని విద్యార్థులకు వాటిని అందజేశారు.

ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ.. టేకుమట్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే టెన్త్ క్లాస్‌లో మండల టాపర్‌కు రూ.2,500, పాఠశాల స్థాయి టాపర్‌కు రూ.1,000 బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలు సాధించాలని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్, శనిగరపు భద్రయ్య, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు తిరి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దూడం రాజేందర్, సోషల్ జస్టిస్ మియాపురం హరీష్ కుమార్, ఎడ్యుకేషనల్ వింగ్ ఫిరోజ్ ఖాన్, ఆర్గనైజర్ సెక్రటరీ జల్లారపు ప్రసాద్ తదితరులు, హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply