కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ ఇండ్లు సాధ్యం

  • ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు అవసరమని, అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం మన మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్లు పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.