చేనేత సహకార సంఘం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

  • ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామ చేనేత సహకార సంఘం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు సర్పంచ్ కోటం వెంకటేశం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ గుజ్జర్ యాదగిరి, ఉపాధ్యక్షుడు కోటం వెంకటేశం, కార్యదర్శి వడ్డేపల్లి మురళి, కోశాధికారి గంజి శ్రీను, డైరెక్టర్లు జిల్లా ముత్యాలు, జిల్లా నరసింహ, జిల్లా సత్యనారాయణ, జిల్లా పద్మ, జిల్లా శారదాంబలను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ, చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, సాగర నాగరాజు, జిల్లా ప్రశాంత్, జిల్లా అనంతరాములు, గంజి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.