లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వ హయాం నుండి పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వడం అభినంద నీయమని గ్రామ సర్పంచ్ మేసా కార్తీక్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా గ్రామ పంచాయతీ వద్ద గురువారం సర్పంచ్ మేసా కార్తీక్ స్థానిక నాయకుల చేతుల మీదుగా లబ్దిదారులకు మంజూరైన మూడు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డలకు ఆదుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మైనింగ్ శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ లకు లబ్ధిదారులు నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి (జిపివో) సునీల్, ఉప సర్పంచ్ మూడేళ్ల లింబయ్య, వార్డ్ మెంబర్ పుప్పాల రాజు,నాయకులు మేకల శ్రీనివాస్, మూడేళ్ల కుమార్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
