శరవేగంగా కొనసాగుతున్న డిజిటలైజేషన్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ :అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్వూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కావడంతో పాటు డిజిటలైజేషన్ సైతం శరవేగంగా కొనసాగుతున్నది. ఈ మేరకు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల తహసీల్దార్ పూజారి కిరణ్ కుమార్ ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సర్ ఫారాలను 73 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. రెవెన్యూ పరిధిలో 72 పోలింగ్ బూత్ లు ఉండగా 76 వేల 465 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.

స్వీకరించిన వాటిలో 55 వేల 755 సర్ ఫారాలను డిజిటలైజేషన్ చేయడం చేయడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు. బీఎల్ఓలు సేకరించిన సర్ పారాల వివరాలను ఎలక్షన్ కమిషన్ యాప్ ల ద్వారా చేపట్టిన డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క ఓటు తొలిగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్లో మార్పులు చేసిన దృష్ట్యా ఆగస్టు 3 వరకు ఫారాల సేకరణ, ఇంటింటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

కావున ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, అర్హుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. గడువులోపే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అందరి సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు.